నిశ్చయమైన వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం : సోషల్ మీడియా ద్వారా వెల్లడి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో నిశ్చయమైంది. ఈ వార్తను వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా పంచుకున్నారు. దేవుని దయతో తమ కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాలు పూర్తయ్యాయని, ఈ పండుగ లాంటి వార్తను అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డిల కుమారుడైన డాక్టర్ రఘురామ్ రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనుంది. రఘురామ్ రెడ్డి కుటుంబం అమెరికాలో స్థిరపడగా ఆ కుటుంబ సభ్యులంతా యుఎస్ పౌరసత్వం కలిగినవారు. వీరి మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినవి . వృత్తిరీత్యా రఘురామ్ రెడ్డి అమెరికాలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు.