మహిళల ఆసియా కప్‌ 2026 : సెమీస్‌కు చేరిన టీమిండియా

దుబాయ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌ 2026లో పాకిస్తాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ జట్లను సునాయాసంగా ఓడించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆరు పాయింట్లతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తన మూడో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌ను ఓడించింది. గ్రూప్ ఏ నుంచి రెండో జట్టు అయిన పాకిస్థాన్ కూడా సెమీఫైనల్స్‌కు చేరే అవకాశం ఉంది. పాకిస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్‌లు సెమీఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. పాకిస్థాన్ ఆఖరి మ్యాచ్ హాంగ్‌కాంగ్‌తో జరగనుంది.  గ్రూప్ బీలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ తేడాతో గెలిచింది. శ్రీలంక నెట్ రన్ రేట్ ఐదుకు దగ్గరగా ఉంది. శ్రీలంక ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. శ్రీలంక సెమీ-ఫైనల్స్‌కు కూడా దాదాపు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఇండోనేషియాపై 71 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్, రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ గ్రూప్ నుంచి రెండు జట్లకు సెమీ-ఫైనల్ స్థానాలు ఖాయమయ్యాయి. మొదటి సెమీ-ఫైనల్ గ్రూప్ ఏలోని మొదటి స్థానంలో ఉన్న జట్టుకు, గ్రూప్ బీలోని రెండో స్థానంలో ఉన్న జట్టుకు మధ్య జరుగుతుంది. రెండో సెమీ-ఫైనల్ గ్రూప్ ఏలోని రెండో స్థానంలో ఉన్న జట్టుకు, గ్రూప్ బీలోని మొదటి స్థానంలో ఉన్న జట్టుకు మధ్య జరుగుతుంది. గ్రూప్ ఏలో భారత్ మొదటి స్థానంలో ఉంది, కాబట్టి ఇప్పుడు వారు గ్రూప్ బీలోని రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడతారు. గ్రూప్ బీలో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల సెమీ-ఫైనల్స్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ రెండు జట్లకు బలమైన చరిత్ర ఉంది. మొదటి సెమీఫైనల్ సెప్టెంబర్ 10న జరగనుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org