మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది దుర్మరణం : 100 మంది పరిస్థితి విషమం

ధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బండాలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని సాగర్‌లోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అస్వస్థతకు గురైన 100 మందికి పైగా వ్యక్తులు బందాలోని సివిల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 14 మంది మరణించారు. మరణించిన వారి మృతదేహాలకు బందా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, కలెక్టర్ ప్రతిభా పాల్, ఎస్పీ అనురాగ్ సుజానియాతో సహా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు బందాకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులు ఆసుపత్రిని సందర్శించి, ఈ వ్యవహారంపై దర్యాప్తును ప్రారంభించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు బందాలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు గల కారణాలపై యంత్రాంగం మరియు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org