భార్యను బ్యాంకు నుండి బయటకు లాకొచ్చి తలపై బండరాయితో కొట్టి హత్య చేసిన భర్త
కర్ణాటక సరిహద్దు గ్రామం గుమ్మళాపురంలో ఇల్లు అమ్మి ప్రియుడితో పారిపోయిన భార్యను ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన నారాయణ స్వామికి కొన్నేళ్ల క్రితం విద్యతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఏడాది కాలంగా విద్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు మందలించాడు. గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. ఈ క్రమంలో నారాయణ స్వామికి అప్పులు పెరగడంతో తన ఇంటిని రూ.22 లక్షలకు అమ్మి అప్పు తీర్చాడు. మిగిలిన రూ.5 లక్షలను తన భార్య ఖాతాలో వేశాడు. కొద్దిరోజుల క్రితం విద్య, ప్రియుడు పునీత్ తో ఇంటి నుండి వెళ్లిపోయి బెంగళూరు దగ్గర ఆనేకల్ లో మకాం వేసింది. అది తెలిసిన నారయణస్వామి ఆనేకల్ కు వెళ్లి భార్యను తిగిరిరావాలని కోరాడు. కానీ భర్తతో వచ్చేందుకు ఆమె నో చెప్పింది. అయితే సోమవారం ఆమె డబ్బుల కోసం గుమ్మళాపురం గ్రామానికి వచ్చింది. విషయం తెలియడంతో ఆమె భర్త కూడా బ్యాంక్ వద్దకు వెళ్లాడు. ఆమె ఖాతాలో ఉన్న డబ్బులు తిరిగివ్వాలని, ఆస్తిని పిల్లల పేరుమీద రాయాలని గొడవ చేశాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో బ్యాంకు నుండి బయటకు లాకొచ్చి తలపై బండరాయితో చితకబాది హత్య చేశాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.