ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు : వరదలో కొట్టుకుపోయిన ఏనుగులు

త్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్‌ జిల్లా కౌడియాల నది ఉద్ధృతికి ఐదు ఏనుగులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలో రెండు ఏనుగు పిల్లలు కూడా ఉన్నాయి. ఏనుగుల గుంపు గిర్జాపురి బ్యారేజ్ వైపు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కతర్నియాఘాట్ వన్యప్రాణి విభాగం అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో బ్యారేజ్ గేట్లను మూసివేసి, నీటి ప్రవాహ తీవ్రతను తగ్గించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది ఐదు ఏనుగులను సురక్షితంగా బయటకు తీసి, అటవీ ప్రాంతానికి మళ్లించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org