చండీగఢ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ఎల్ఈడీ తో పాటు పలు ఆయుధాలను సీజ్
చండీగఢ్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నమయింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎల్ఈడీ తో పాటు పలు ఆయుధాలను సీజ్ చేశారు. సెక్టార్-36 పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్ఆఐర్ నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులకు అందిన సమచారంతో ఈ దాడులు జరిగాయి. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కీలక ఆధారాలను గుర్తించినట్లు తెలిసింది. వీరి వెనక ఎవరు ఉన్నారన్న కోణంలో విచారణను చేపడుతున్నారు