టీజీఎస్ ఆర్టీసీలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం సేవలు : పైలట్​ ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్​ స్టేషన్

తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం సేవలను ప్రయాణికులకు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మహబూబ్ ​నగర్ జిల్లాలోని జడ్చర్ల బస్​ స్టేషన్ పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, జీపీఎస్​ విధానం ద్వారా ప్రయాణికులకు సమాచారం అందిస్తోంది. కొద్ది రోజుల కిందట టీజీఎస్ ఆర్టీసీ అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు. కర్ణాటకలో పర్యటించిన సందర్భంలో రాయచూర్ బస్​ స్టేషన్​లో జీపీఎస్​ విధానం ద్వారా మెట్రో స్టేషన్​ తరహాలో ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి అక్కడి అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం బస్సు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొదట పైలట్​ ప్రాజెక్టు కింద ఒక బస్​ స్టేషన్​ లో జీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం జడ్చర్లలో విజయవంతం అయితే మిగతా బస్​ స్టేషన్లలో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానానికి సంబంధించి ఈ నెల మొదటి వారం స్టేషన్​లో ఎల్​ఈడీ స్క్రీన్​లను, జీపీఎస్​ ట్రాకర్​ ఏర్పాటు చేయనున్నారు. వాటిని ఆన్ లైన్ కు అనుసంధానం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్యూటర్ ​ను అందుబాటులో ఉంచనున్నారు. జీపీఎస్​ ట్రాకర్​ ద్వారా ఏ బస్సు ఎక్కడికి వస్తోంది? ఎప్పుడు వస్తోంది? ఆయా మార్గాల్లో ఏ బస్సు సర్వీసులు వస్తున్నాయి? అని ఎల్​ఈడీ స్ర్కీన్​ మీద చూపించనున్నారు. బస్సు స్టాండ్ కు 500 మీటర్ల దూరంలో ఉండగానే జీపీఎస్​ విధానం ద్వారా అటోమెటిక్​ అనౌన్స్​మెంట్ కూడా వస్తోంది. ఆ బస్సు ఏ ప్లాట్ ఫాం వద్ద ఆగుతుందో కూడా సమాచారం అందుతోంది. ఈ విధానంపై ప్రయాణికులు కూడా సంతృప్తిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలన్నిటిని రికార్డ్​ చేసి సంస్థకు 20 రోజుల ట్రయల్​ రన్​ సక్సెస్​ అయినట్లు నివేదికను పంపారు. త్వరలో రాష్ర్టంలోని పలు బస్​ స్టేషన్​లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నవారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org