చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ ను అనుసంధానించే క్రమంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన 'చీనాబ్' రైల్వే బ్రిడ్జిపై ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై గంటకు దాదాపు 100 కి.మీ వేగంతో శరవేగంగా ప్రయాణించి, భారత్‌ తన రవాణా సాంకేతికతతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. ఉత్తర రైల్వే పరిధిలోని శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి బనిహాల్ వరకు ఉన్న 111 కిలోమీటర్ల పొడవైన నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. గతంలో ఈ మార్గంలోని కత్రా-సంగల్దాన్ సెక్షన్‌లో గంటకు 85 కి.మీ, అలాగే సంగల్దాన్-బనిహాల్ సెక్షన్‌లో గంటకు 75 కి.మీ మాత్రమే గరిష్ట వేగానికి అనుమతి ఉండేది. అయితే అన్ని రకాల ముందస్తు భద్రతా తనిఖీలను సమర్థవంతంగా పూర్తి చేసి నిబంధనలు పాటించడంతో అధికారులు ఈ స్పీడ్ లిమిట్‌ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org