రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే : ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా నెహ్వాల్

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. సైనా రాజకీయ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానప్పటికీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు సైనా నెహ్వాల్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇన్నాళ్లు ఒక క్రీడాకారిణిగా దేశానికి సేవ చేశానని, ఇకపై రాజకీయ నాయకురాలిగా బీజేపీ తరఫున దేశాభివృద్ధికి దోహదపడాలని భావిస్తున్నట్లు సైనా తన మనసులోని మాటను బయటపెట్టింది. సైనా నెహ్వాల్ 2020లో బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ ''రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే. కానీ ఎప్పుడు రావాలనే దానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా దేశానికి ఎన్నో ఏళ్లు ప్రాతినిధ్యం వహించాను. ఒలింపిక్స్‌లో పతకం కూడా అందించాను. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం. ఆ పార్టీ దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న కృషి నాకు బాగా నచ్చింది. అందుకే బీజేపీలో చేరాను. ఇప్పుడు బీజేపీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి రాజకీయ నేతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. బీజేపీలో కొనసాగుతూ దేశానికి సేవ చేయడం కోసం ఎదురుచూస్తున్నా. మనందరం ఐక్యంగా ఉంటేనే దేశాభివృద్ధి కోసం మరింత మెరుగ్గా పనిచేయగలం'' అని సైనా చెప్పుకొచ్చింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org