దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11న దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజున సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా నాలుగురోజుల పాటు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11న శుక్రవారం. తర్వాత రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు. ఇక సోమవారం14న వినాయక చవితి కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల బ్యాంకు కార్యకలాపాలు నడవవు. అలా నాలుగురోజుల పాటు బ్యాంక్ సేవలు అందక ప్రజలు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 11వ తేదీతోపాటు సెప్టెంబర్ 28 నుంచి మూడురోజుల పాటు మరోసారి సమ్మె చేస్తామని యూనియన్ హెచ్చరించింది. సెప్టెంబర్ 30తో ఆర్థిక సంవత్సరం సగం పూర్తవుతుంది. అప్పుడు అన్ని సంస్థలు తమ ఖాతా పుస్తకాలను సరిచూసుకుంటాయి. వారానికి ఐదు రోజుల డిమాండ్‌తో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం, పింఛను విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బ్యాంక్ సిబ్బంది కోరుతున్నారు. ఇప్పటికే రెండో, నాలుగో శనివారం సెలవులు ఇస్తున్నారు. మరో రెండు సెలవులు ఇస్తే అలా నెలలో ఐదురోజుల పనిదినం అమలవుతుంది. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు.
0 Comments