నడిరోడ్డుపై మహిళా కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన భర్త

మిళనాడు లోని వేలూరు జిల్లా గుడియాత్తంలో మహిళా కానిస్టేబుల్‌ను భర్త కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తామరై సెల్వి అనే యువతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. సెల్వి భర్త అరవింద్‌తో విభేదాలు రావడంతో ఇద్దరు మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సెల్వి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆమెపై భర్త కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రాఘవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org