బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ : వాంగ్ జి యీ చేతిలో సింధు ఓటమి

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలనే పివి సింధు కల చెదిరింది. ప్రిక్వార్టర్స్‌లో నంబర్ 3 సీడెడ్ ప్లేయర్ వాంగ్ జి యీ చేతిలో సింధు ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన పోరులో 11-21, 21-15, 17-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. అయితే, వాంగ్ మధ్యమధ్యలో గాయం పేరుతో విరామాలు తీసుకుంటూ ఉండటంతో సింధు ఏకాగ్రత కోల్పోయింది. తాను మరింత ఓపికగా ఆడాల్సిందని చెప్పింది.  వాంగ్ తీరుపై విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఆమె తీసుకున్న విరామాలే. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వాంగ్ ఆటను కొనసాగించలేని స్థితిలో ఎప్పుడూ కనిపించలేదు. అయినా సరే గాయం పేరుతో విరామాలు తీసుకుంది. వాంగ్ క్రాంప్స్ కారణంగా పలు సందర్భాల్లో ఆటకు అంతరాయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం.. అవసరమైతేనే ర్యాలీల మధ్య 25 సెకన్ల వ్యవధిని పొడిగించే అవకాశం అంపైర్లకు ఉంది. కానీ, వాంగ్ మాత్రం అదనంగా సమయం తీసుకుంది. మెడికల్ టైమౌట్ విషయంలో సమయం ఎక్కువగా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టైమౌట్‌కు నిర్దిష్టమైన వ్యవధి లేదు. సదరు ప్లేయర్ ఆడలేరని భావిస్తేనే అంపైర్ అదనపు సమయం ఇస్తారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత.. వాంగ్‌కు నిజంగా గాయమైందా? లేదా? వ్యూహం అయి ఉండొచ్చని సింధు వ్యాఖ్యానించింది. మరోవైపు వాంగ్ మాత్రం తాను నిజంగానే ఇబ్బంది పడినట్లు చెప్పింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org