లాంచ్ ఆఫర్స్ తో అందుబాటులోకి వచ్చిన వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్

న్ ప్లస్ ఎన్ 6ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఈ రోజు మొదటి  సేల్ అందుబాటులోకి వచ్చింది. దీనిపై వన్ ప్లస్  లాంచ్ ఆఫర్స్ ని అందించింది. ఈ ఫోన్ పై అందించిన డీల్స్ కేవలం కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ పీరియడ్ డీల్స్ మాత్రమే. కాబట్టి, ఈ ఫోన్ ను ముందుగా తీసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి. వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ ఉంది.  ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఎలాగంటే, ఈ ఫోన్ పై వన్ ప్లస్ ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,499 మరియు రూ. 19,499 రూపాయల ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఇది కాకుండా 6 నెలల Bajaj నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది. ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే HD + రిజల్యూషన్ జతగా 120Hz రిజల్యూషన్ తో మంచి స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది మరియు 900 HBM పీక్ బ్రైట్నెస్ తో బ్రైట్ విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6360 Apex ప్రాసెసర్ వస్తుంది మరియు జతగా 4GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబులిటీ సర్టిఫికేషన్ తో చాలా దృఢమైన డిజైన్ లో ఉంటుంది. ఇది 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ లో ముందు 5MP సెల్ఫీ కెమెరా ని వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ కెమెరాతో లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్, వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్లు మరియు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ లో భారీ 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org