బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 : రూ.1కే 24 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 1జీబీ డేటా
ఫ్రీడమ్ 2.0 పేరుతో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. కేవలం ఒక్క రూపాయి రీఛార్జ్‌తో 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 1 జీబీ డేటా అందిస్తుంది. మొబైల్ రీఛార్జీ ప్లాన్స్ పెరుగుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ.1 సిమ్ ఆఫర్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రీడమ్ ఆఫర్ గురించిన వివరాలను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్స్ రూ.1కే సిమ్ కార్డు పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్స్‌కు 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు రోజుకు 1GB హై-స్పీడ్ డేటా, 100 SMS కూడా లభిస్తాయి. 24 రోజులు వ్యవధిలో 24 జీబీ డేటా వరకు డేటాను పొందవచ్చు.