రూ.10,000 ఇస్తావా ? రేప్ కేసు పెట్టమంటావా? : క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించిన మహిళలు : వీడియో నెట్టింట వైరల్

హారాష్ట్రలోని కళ్యాణ్ పరిధిలో గల గోవిందవాడి బైపాస్ రోడ్డులో ఒక క్యాబ్ డ్రైవర్‌పై తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరించి రూ.10,000 వసూలు చేసేందుకు యత్నించిన ఇద్దరు మహిళల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఘటన జరిగిన రోజున సచిన్ షిండే అనే ట్యాక్సీ డ్రైవర్‌ను అడ్డగించిన ఇద్దరు మహిళలు తమను భివాండికి తీసుకెళ్లాలని కోరారు. అయితే తాను కోన్ గ్రామం వరకే వెళ్తానని డ్రైవర్ స్పష్టం చేసినప్పటికీ ఆ మహిళలు బలవంతంగా కారు ఎక్కారు. కారు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ మహిళలు డ్రైవర్ వద్ద రూ.10,000 డబ్బులు డిమాండ్ చేశారు. దానికి డ్రైవర్ నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ మహిళలు, తమ బట్టలను తామే చింపుకుని అత్యాచారం తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు దిగారు. వారి బెదిరింపులకు ఏమాత్రం లొంగని డ్రైవర్ సచిన్, వెంటనే చాకచక్యంగా పోలీసులకు సమాచారం అందిస్తూ కారును నేరుగా పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. దుర్గాడి వంతెన దాటిన తర్వాత ఎదురుగా వచ్చిన పోలీస్ వాహనాన్ని చూసిన ఆ ఇద్దరు మహిళలు భయాందోళనకు గురై, కదులుతున్న కారు నుంచే కిందికి దూకి అక్కడికక్కడే పరారయ్యారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org