శాంసంగ్ నిర్వహించిన అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి ఈరోజు ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ముందు సిరీస్ కంటే స్లీక్ డిజైన్, డ్యూయల్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ వంటి అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అత్యంత స్లిమ్ అండ్ లైట్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ప్రీమియం ఫోన్ మడిచినప్పుడు 8.9mm మందంతో మరియు తెరిచినప్పుడు కేవలం 4.1 mm మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 215 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ లో 8 అంగుళాల ప్రధాన ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది QXGA+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో 6.5 అంగుళాల డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఇది FHD+ రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది హై ఎండ్ గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ ను సైతం అలవోకగా నిర్వహిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో గరిష్టంగా 16GB ర్యామ్ మరియు 1TB వరకు స్టోరేజ్ ఆఫర్ చేస్తోంది . ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ One UI 9 సాఫ్ట్ వేర్ తో Android 17 OS తో లాంచ్ అయ్యింది. ఇది లేటెస్ట్ గెలాక్సీ AI ఫీచర్లు, Gemini Live, ఫోటో అసిస్ట్ వంటి స్మార్ట్ టూల్స్ తో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ సెటప్ లో 200MP వైడ్ యాంగిల్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా 8K మరియు 4K HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, అనేకమైన లేటెస్ట్ AI ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన శాంసంగ్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 10MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది 5,000mAh డ్యూయల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 20W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో IP48 రేటింగ్, Wi-Fi 7, Samsung Knox సెక్యూరిటీ, మరియు అధునాతన మల్టీ విండో వంటి ఫీచర్లు ఉన్నాయి.
0 Comments