ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం : పెళ్లికొడుకు రాకపోవడంతో పక్కింటి వ్యక్తిని కూర్చోబెట్టిన వధువు తరపు వారు

త్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద జరుగుతున్న ఒక పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు రాకపోవడంతో, వధువు తరపు వారు పక్కింటి యువకుడికి కట్నం ఆశ చూపి పెళ్లి పీటలపై కూర్చోబెట్టిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కౌశాంబీకి చెందిన యువతికి, రాయ్‌బరేలీకి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అయితే, సామూహిక వివాహ వేదిక వద్దకు వరుడు రాకపోవడంతో వధువు తల్లి, పెళ్లి ఆగిపోకుండా ఉండేందుకు గ్రామస్తుడైన ఒక యువకుడిని ఒప్పించి పెళ్లి మండపంలో కూర్చోబెట్టింది. దురదృష్టవశాత్తూ, ఆ పెళ్లి పీటలపై కూర్చున్న యువకుడి తండ్రి అదే ప్రాంతంలోని ఫైర్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. తన కొడుకు అక్కడ ఉండటాన్ని చూసి షాక్ తిన్న తండ్రి, అందరి ముందు తన కొడుకును చితకబాదాడు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వధువు, ఆమె తల్లి మరియు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. సీడీఓ వినోద్ రామ్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల మేరకు పెళ్లికి ముందు వధూవరుల వేలిముద్రలను సరిచూస్తారు. వరుడి వేలిముద్రలు సరిపోలకపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై, ఆ వివాహ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు మండపంలోకి ఎలా వచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org