ఒమన్ తీరంలో నౌకపై ఇరాన్‌ దాడి : భారతీయుడి గల్లంతు

మన్ తీరంలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్ ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడులు జరిపింది. దాడి తర్వాత ఓ భారతీయడు గల్లంతైనట్లు సమాచారం. దాడులు కారణంగా 'జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌకలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది ప్రాణాలు రక్షించుకోవడానికి నౌకను విడిచిపెట్టాల్సి వచ్చింది. నౌకలో ఉన్న మొత్తం 11 మంది భారతీయులలో 10 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించగా.. మరొకరు గల్లంతయినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం అర్ధరాత్రి ఇరాన్‌పై మూడో విడతగా యూఎస్‌ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల్లో ఇరాన్‌, డ్రోన్‌, క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. ఈ ఒక్కవారంలోనే అమెరికా జరిపిన 3 విడతల దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300కు పైగా వ్యూహాత్మక సైనిక కేంద్రాలు తగలబడ్డాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org