వనస్థలిపురంలో దారుణ హత్య

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ జోన్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి, పనామా చౌరస్తా సమీపంలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు అతడిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి కిరాతకంగా చంపేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న సదరు వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ హత్య పాత కక్షల కారణంగా జరిగిందా? లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org