Ad Code

13, 14 తేదీల్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర

తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈ నెల 13, 14 తేదీల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను చేపట్టనుంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ యాత్ర సాగనుంది. తొలి రోజు కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లిలో ఈ యాత్రను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సింగరేణి కార్మికులను బీజేపీ నేతలు కలవనున్నారు. 14వ తేదీన భూపాలపల్లి కేటీకే 8 మైన్ వద్ద కార్మికులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తాడిచర్ల మైన్స్‌కు వారు చేరుకుంటారు. గోదావరి ఖని ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. అనంతరం శ్రీరాంపూర్ 3 మైన్స్ విజిటింగ్‌తోపాటు కార్మికులతో వారంతా ఇంటరాక్షన్ అవుతారు. ఆపై మంచిర్యాలలో ఈ యాత్ర ముగియనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో మూడు సభలు, ఐదు చోట్ల కార్మికులతో ముఖాముఖి, సమావేశాలను బీజేపీ నేతలు నిర్వహించనున్నారు. 41 వేల మంది సింగరేణి కార్మికులు, దాదాపు 30 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడంలో భాగంగా బీజేపీ ఈ యాత్ర చేపడుతుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావుతోపాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu