గుండె సమస్యలను ముందే పసిగట్టి అలర్ట్ చేసే స్మార్ట్‌వాచ్‌లు !

స్మార్ట్‌వాచ్‌లు ఎన్నో రకాల హెల్త్ ఫీచర్లతో వస్తున్నాయి. చేతికి వాచ్ కట్టుకుంటే చాలు, అది మన గుండె వేగాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తుంది. కొన్నిసార్లు గుండె వేగంలో వచ్చే తేడాలను కనిపెట్టి మనల్ని అలర్ట్ కూడా చేస్తుంది. అయితే ఇవి నిజంగానే గుండె జబ్బులను ముందే చెప్తాయా అంటే కొన్ని సమస్యలను గుర్తిస్తాయి, కానీ అన్నింటినీ కాదు. స్మార్ట్‌వాచ్‌లు గుండె కొట్టుకునే వేగంలో వచ్చే మార్పులను, క్రమరహిత లయ (అరిథ్మియా) వంటి సమస్యలను గుర్తించగలవు. ముఖ్యంగా ‘ఏట్రియల్ ఫైబ్రిలేషన్’ అనే ప్రమాదకరమైన గుండె సమస్యను ఇవి ముందే పసిగడతాయి. ఇక గుండె అసాధారణంగా కొట్టుకుంటున్నప్పుడు వాచ్ మనకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ చేస్తుంది. దీనివల్ల మనం ముందే జాగ్రత్త పడవచ్చు. వీటిలో ‘PPG’ సెన్సార్లు ఉంటాయి. ఇవి మన మణికట్టుపై రక్తప్రసరణను పర్యవేక్షించి, హృదయ స్పందన రేటును కొలుస్తాయి. అలాగే కొన్ని అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌వాచ్‌లలో ‘ECG’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇక ఇది గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను రికార్డ్ చేసి, గుండె కొట్టుకోవడంలో ఏదైనా తేడా ఉందో లేదో ఇట్టే చెప్పేస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు కేవలం పగలే కాదు, రాత్రి పూట కూడా మన ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉంటాయి. మనం పడుకున్నప్పుడు మన నిద్రను పర్యవేక్షిస్తాయి. ఇక ముఖ్యంగా నిద్రలో శ్వాస ఆగిపోవడం (స్లీప్ అప్నియా) వంటి ప్రమాదకరమైన సమస్యలను ఇవి పసిగట్టగలవు. రాత్రి పూట ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా ఇవి మనకు అలర్ట్ ఇస్తాయి. స్మార్ట్‌వాచ్‌లు ‘గుండెపోటు’ వంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను అస్సలు గుర్తించలేవు. ఇక రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల వచ్చే హార్ట్ ఎటాక్‌లను పసిగట్టే శక్తి వీటికి లేదు. దీనికోసం హాస్పిటల్స్‌లో చేసే ’12-లీడ్ ఈసీజీ’ టెస్ట్ మాత్రమే కరెక్ట్ రీడింగ్ ఇస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. గుండె సమస్యలను ముందే పసిగట్టి అలర్ట్ చేయడంలో ఇవి బెస్ట్ గ్యాడ్జెట్స్ అనడంలో సందేహం లేదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org