నేను గుంపు మేస్త్రినే : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను గుంపు మేస్త్రీ అంటూ బీఆర్ఎస్ నేతలు మరియు ఇతర వ్యతిరేక పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను గుంపు మేస్త్రీనే అని గర్వంగా ప్రకటించారు. తన గుంపు తనకు బలమని, ఆ బలమే తన ప్రతిష్ఠ అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని ఒక కార్యక్రమంలో చేశారు. ప్రతిపక్షాలు తనపై అవహేళన చేస్తున్నా తాను పట్టించుకోవడం లేదని, దానిని ఎప్పటికప్పుడు స్వీకరించి ముందుకు సాగుతున్నానని సీఎం స్పష్టం చేశారు. తన గుంపులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలంతా తన గుంపులో భాగమే అని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. కొందరు తాము దొరలమని గొప్పలు చెప్పుకుంటారు. నాకు అలాంటి భావన లేదు. నాకు సార్ అని పిలవడం కంటే రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఇష్టం, ప్రేమ ఉంటేనే సీఎంను కూడా అన్నా అని పిలుస్తారని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన పనులు చేపడుతుంటే తన కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రోను విస్తరించాలని ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పనులు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఫాంహౌస్‌లలో ఉంటున్న వారికి ఇవి అవసరం లేకపోవచ్చని, కానీ సామాన్యుల జీవనం మెరుగుపరచడానికి ఇవి చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి వివరించారు.గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిందని, ఆ పార్టీకి గోరీ కట్టే మేస్త్రీగా తాను పని చేస్తున్నానని ఇంతకుముందు కూడా ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి గుంపు మేస్త్రీ అని తనను తాను ప్రకటించటం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో మంచి స్పందన పొందుతోంది. తెలంగాణ అభివృద్ధికి తన గుంపుతో కలిసి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org