ఫ్లిప్ కార్ట్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఈరోజు 55 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ 22 వేలకు పొందొచ్చు. అయితే, ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ టీవీ బ్రాండ్ CooCaa వై సిరీస్ నుంచి అందించిన 55Y74 Plus స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ టీవీ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 56% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1,950 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 22,049 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. కూకా Y74 Plus 55 అంగుళాల UHD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ అత్యాధునిక ఫీచర్లతోమంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ టీవీ (3840 × 2160) పిక్సెల్స్ 4K రిజల్యూషన్ తో ప్రతి చిత్రం స్పష్టంగా మరియు సహజ రంగులతో కనిపిస్తుంది. ఈ టీవీ HDR10 మరియు HLG టెక్నాలజీల సపోర్ట్ వల్ల మరింత మెరుగైన కాంట్రాస్ట్, బ్రైట్నెస్ మరియు మంచి కలర్ నాణ్యత లభిస్తుంది. ఈ టీవీ కలిగిన Eye Care Technology తో ఎక్కువ సేపు టీవీ చూసినా కళ్లపై ఒత్తిడి కలగకుండా ఉంటుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ టీవీ Netflix, YouTube, Prime Video, జియో హాట్ స్టార్ వంటి ప్రముఖ OTT యాప్ లను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 32GB అంతర్గత స్టోరేజ్ ఉండటంతో మరిన్ని యాప్‌లు ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ మరియు గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ తో స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ను మరింత సులభతరం చేస్తుంది. ఆడియో పరంగా 20W స్పీకర్ అవుట్ పుట్ తో పాటు Dolby Audio సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ కోసం HDMI పోర్టులు, USB పోర్టులు, Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్ LAN , AV ఇన్ పుట్ మరియు హెడ్ ఫోన్ అవుట్ పుట్ వంటి అనేక ఎంపికలు ఈ టీవీలో అందుబాటులో ఉన్నాయి.
0 Comments