రాజకీయంగా అణగదొక్కాలని అసత్య ఆరోపణలతో కుట్రలు పన్నుతున్నారు : మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు

ఆంధ్రప్రదేశ్ లో మాజీ వైసీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తనపై మీడియా లో వస్తున్న అసత్య ఆరోపణలపై స్పందిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను రాజకీయంగా అణగదొక్కాలని అసత్య ఆరోపణలతో కుట్రలు పన్నుతున్నారని, కోర్టు పరిధిలో ఉన్న అంశం పై పోలీసులు అత్యుత్సాహం తో 41 నోటీసులు ఇచ్చి నా పై కక్ష సాధింపు చర్యలతో వేధించడం సరియైన పద్దతి కాదని అయన ఆరోపించారు. దేవరపల్లి పోలీసులు ఆడవారిని సైతం స్టేషన్ కు పిలిచి పరుష పదజాలంతో మాట్లాడి తీవ్రంగా అవమానించారని నన్ను నా రాజకీయ జీవితాన్ని బద్నాం చేయడం కోసమే ఈ అసత్య ఆరోపణలు, పోలీసులు వేధింపులు చేస్తున్నారని మీరు పెట్టే తప్పుడు కేసులకి, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఎవరు ఒత్తిడితోనో నన్ను ఇబ్బంది పెట్టాలని నాపై తప్పుడు కేసులు పెడితే కోర్టులో ఇబ్బంది పడేది మీరేనని పోలీసులను హెచ్చరిస్తున్నానని అన్నారు. నా పై అసత్య ఆరోపణలు అక్రమ కేసులు పై న్యాయస్థానంలో న్యాయ బద్దంగా పోరాడుతానని అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org