ఫ్రెంచ్‌ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌

ర్మనీ టెన్నిస్ట్ స్టార్ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండోసీడ్‌ జ్వెరెవ్‌ 6-1, 4-6, 6-4, 6-7(5-7), 6-1తో 10వ సీడ్‌ ఫ్లావియో కొబొల్లీ (ఇటలీ)పై పోరాడి గెలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో జ్వెరెవ్ అద్వితీయమైన ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నాడు. జ్వెరెవ్‌ తన నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ గెలవడం విశేషం. అతను తొలిసారిగా 2020లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరగా.. డొమినిక్‌ థీమ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2024లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ తుదిపోరుకు అర్హత సాధించినా అల్కారజ్‌ చేతిలో ఓడిపోయాడు. గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్ చేరినా.. జానిక్‌ సినర్‌ చేతిలో కంగుతిన్నాడు. కానీ ఈ పరాజయాల నుంచి పాఠం నేర్చుకున్న ఈ జర్మనీ ఆటగాడు ఈసారి మట్టికోర్టులో ప్రత్యర్థులను మట్టికరిపించాడు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org