జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన హోండా

హోండా కార్స్ ఇండియా జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌యూవీ, సెడాన్ విభాగాల్లో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ తన ప్రముఖ మోడళ్లైన ఎలివేట్, అమేజ్, సిటీ కార్లపై భారీ తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్లు, పొడిగించిన వారంటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. అయితే నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత ఆధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది. హోండా లైనప్‌లో ఈ నెల అత్యధిక ప్రయోజనాలు ఎలివేట్ ఎస్‌యూవీపై అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్‌ఎక్స్ ఎంటీ, జెడ్‌ఎక్స్ సీవీటీ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలు, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం డ్యాష్‌క్యామ్ వంటి యాక్సెసరీ ప్యాకేజీలను కూడా కంపెనీ అందిస్తోంది. మిడ్‌ వేరియంట్లైన వి అపెక్స్, వీఎక్స్ మోడళ్లపై కూడా రూ.1.5 లక్షలకు పైగా బెనిఫిట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఎలివేట్ హోండాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలుస్తోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org