ఫామ్‌హౌస్‌పై మహారాష్ట్ర పోలీసులు దాడి :అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టివేత : రూ.6.5కోట్ల ముడిసరుకు సీజ్


తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మారుమూల గ్రామమైన పీచేర్యాగడి తండాలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఫామ్‌హౌస్ వేదికగా సాగుతున్న ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్ర పోలీసులు మెరుపుదాడి నిర్వహించి, మూడు కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ ముడిపదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు ముంబై నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. మారుమూల ఫామ్‌హౌస్‌ను అడ్డగా మార్చుకుని, డ్రగ్స్ తయారు చేసి, వాటిని ముంబైతో పాటు ఇతర మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అక్రమ డ్రగ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org