విద్యుత్ ఉత్పాదక సామర్థ్య వినియోగ విధానాన్ని సరళీకృతం చేసేందుకు చర్యలు : దృష్టిసారించిన కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ


జాతీయ స్థాయి విద్యుత్ ఉత్పాదక సామర్థ్య వినియోగ విధానాన్ని సరళీకృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. ఈ విషయమై హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ అండ్ సమ్హన్ పవర్ పోర్టల్ లో కొనుగోలుదారులు డిస్కంలు, జెన్కోకు భాగస్వామ్యం కల్పించడానికి, వాటికి ప్రోత్సాహకాలను అందించడానికి అవసరమైన సూచనలు అందించాల్సిం దిగా నేషనల్ పవర్ కమిటీ మిగులు విద్యుత్ పోర్టల్ ఏర్పాటు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖలోని సీనియర్ సెక్రటరీ ఒకరు వెల్లడించారు. విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు విద్యుత్ ను కొనుగోలు చేయడంలో సహాయ వడేందుకు ఈ పోర్టల్ జాతీయ స్థాయి ఉత్పాదక సామర్థ్య వినియోగ విధానాన్ని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యుత్ టారిఫ్ సంబంధిత కమిషన్లతో నిర్ణయించడంతో పాటు, నియంత్రించబడతాయి. సాధారణంగా విద్యుత్ సంక్షోభం ఏప్రిల్, మే. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడటం సర్వసాధారణంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ పవర్ కమిటీ రాష్ట్రాల విద్యుత్ డిస్కంలు, ఉత్పత్తి సంస్థలకు ముఖ్యంగా రిజర్వ్ షట్ డౌన్ కింద ఉన్న యూనిట్లకు ప్రోత్సాహకాలను అందించే విషయంలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ అండ్ సర్న్ పవర్ పోర్టలు మెరుగు పరచడానికి ప్రాంతీయ విద్యుత్ కమిటీలు సూచనలను అందించడం ద్వారా మరింత సేవలను అందించేందుకు నిర్ణయించింది. ఈ విధానంలో మెరుగైన, సరళీ కృత విధానాలతో రాష్ట్రాలకు మరింత విస్తృత సేవలను అందించ వచ్చని భావిస్తోంది. కాగా హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ అండ్ సర్ ప్లస్ పవర్ పోర్టల్ను గత ఏడాది మార్చిలో ప్రారంభించింది. ఏప్రిల్ నెల 3వ తేదీ నుండి రాష్ట్రాలకు విద్యుత్ కావాదేవీలను నిర్వహించడం మొదలు పెట్టింది. ఈ విధానాన్ని ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాలు వినియోగించుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత వరకూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 14 వినతులను పరిష్కరించి కొత్త లబ్దిదారులైన రాష్ట్రా విద్యుత్ పంపిణీ సంస్థలకు మళ్లీ కరెంటును కేటాయించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆధారిటీ చైర్మన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతానికి చెందిన రాష్ట్రాల నుండి భాగస్వామ్యం లేకపోవడం, అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్ను పొందేందుకు పరిమితం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఈస్ట్రన్ రీజియన్ పవర్ కమిటీ, నార్తర్న్ రీజియన్ పవర్ కమిటీ పోర్టలు ఉపయోగించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహించవచ్చని ప్యానల్ నిర్ణయించింది. పోర్టల్లో రాష్ట్రాల భాగస్వామ్యంపై ఎన్నార్పసి చైర్పర్సన్ మాట్లాడుతూ పిపిఎ పరిమితుల కారణంగా విద్యుత్ సంపిణీ సంస్థలు బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తున్నాయన్నారు. గత సంవత్సరంలో హర్యానా తదితర రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖాలాను ఆర్జించడం ప్రారంభించాయని తెలిపారు. అంతేకాకుండా బహిరంగ మార్కెట్ నుండి విద్యుత్ ను కొనుగోలు చేయడం ప్రారంభించాయని వివరించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org