ఏప్రిల్ 13న ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల
దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 13న ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు ఇన్ఫినిక్స్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే ఉండే 360 డిగ్రీ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. ఇది ఫోన్ ను చూసే విధానం మరియు కాపాడే విధానంలో మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుంది. అంటే, లుక్ అండ్ సెక్యూరిటీ పరంగా బాగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ లో వెనుక అన్ని పనులకు సహకరించే యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ ని అన్ లాక్ చేయకుండా వెనక వైపు ఉండే ఈ డిస్ప్లే లో కాల్, నోటిఫికేషన్ మరియు బ్యాటరీ చార్జింగ్ తో పాటు టైం వంటి మరిన్ని వివరాలను చూడవచ్చు. ఈ సెటప్ ఈ ఫోన్ కు ఒక మంచి లుక్ మరియు యూజర్ కు ఒక మంచి అనుభూతిని అందిస్తుందని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది అల్ట్రా క్లియర్ ఇమేజ్ లు అందిస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో జేబీఎల్ ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ మరియు డీటీఎస్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ డీప్ ఓషియన్ బ్లూ, మోచా బ్రౌన్ మరియు సోలార్ ఆరెంజ్ రంగుల్లో లాంచ్ అవుతుంది.