తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్
తెలంగాణలో పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగుతున్నారు. తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో చికెన్ ధరలు పెరుగుతున్నప్పటికీ, తమకు లభించే లాభాలు మాత్రం పెరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి బంద్ ప్రారంభమవుతుందని ప్రకటించారు.