Ad Code

హైదరాబాద్ లో వడగళ్ల వాన !


హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కురిసిన వర్ష బీభత్సం నుంచి తేరుకోకముందే, బుధవారం సాయంత్రం మళ్లీ వరుణుడు ప్రతాపం చూపాడు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. రాబోయే 45 నిమిషాల్లో బి.ఎన్.రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం వైపు ఇవి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఘటకేసర్ నుంచి హయత్‌నగర్, యాచారం, కడ్తాల్, ఆమనగల్ వరకు రాబోయే 2 గంటల పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. వికారాబాద్, చెవెళ్ల, మోయిరాబాద్, షాద్‌నగర్, నారాయణపేట, మెదక్, నాగర్ కర్నూల్, మంచిర్యాల ప్రాంతాల్లోనూ రాబోయే రెండు గంటల పాటు తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కామారెడ్డి, మేడ్చల్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu