Ad Code

వచ్చే నెల ప్రారంభంలో రియల్ మీ 16 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ ?


వచ్చే నెల ప్రారంభంలో రియల్ మీ 16 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.ది. అయితే, అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టిన రియల్ మీ, ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది. ఈ టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ ప్రత్యేకమైన ఫీచర్ గురించి వెల్లడించింది. ఈ ఫోన్ ను ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ ఫోను గా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లో వెనుక ఉన్న రియర్ కెమెరాతో జతగా ఒక ప్రత్యేకమైన మిర్రర్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో చూపించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో పైన అడ్డంగా ఉన్న కెమెరా బార్ ను అందించింది. ఈ ఫోన్ ను సరికొత్త ఎయిర్ డిజైన్ తో తో లాంచ్ చేస్తోంది. ఇందులో వెనుక మెరిసే రెక్కల వంటి డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.57 ఇంచ్ కాంపాక్ట్ స్క్రీన్ ఉంటుంది. ఇది 4200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 2160 PWM డిమ్మింగ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 8.1 mm మందంతో స్లీక్ గా మరియు కేవలం 183 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ ఎయిర్ వైట్ మరియు ఎయిర్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.  ఈ ఫోన్ ను భారీ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో లాంచ్ చేస్తునట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. అంతేకాదు దీనికి తగిన 60W ఫస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ 300% స్టీరియో సౌండ్ అందించే డ్యూయల్ స్టెరో స్పీకర్లు కూడా కూడా ఉంటుంది. IP69 రేటింగ్ తో ఈ ఫోన్ ను మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu