Ad Code

మార్చి 5న నథింగ్‌ ఫోన్ 4a సిరీస్‌ విడుదల


థింగ్‌ ఫోన్ 4a సిరీస్‌ ప్రత్యేక డిజైన్‌తో మార్చి 5 వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నథింగ్‌ ఫోన్‌ 4a, ఫోన్ 4a ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ కూడా విడుదల అయింది.  తాజాగా నథింగ్‌ ఫోన్‌ 4a బ్యాక్ ప్యానల్‌ డిజైన్‌ను షేర్‌ చేసింది. ఎప్పటి లాగానే ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌ను కలిగి ఉంది. నథింగ్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా షేర్‌ చేసిన డిజైన్‌ ఆధారంగా ఈ ఫోన్‌ వైట్‌ కలర్‌ వేరియంట్‌లోనూ అందుబాటులోకి వస్తుంది. పిల్‌ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లు పక్కపక్కనే ఉన్నాయి. మరో లెన్స్‌ కాస్త దూరంలో వేరుగా ఉంది. LED ఫ్లాష్‌ లైట్‌ కాస్త పైభాగాన అమర్చి ఉంది. గత వారం లాంచ్ అయిన టీజర్‌ ఆధారంగా ఈ సిరీస్‌ సరికొత్త గ్లిఫ్‌ బార్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మొత్తంగా 9 మినీ LED లు 6 లైటింగ్‌ జోన్‌లుగా అమర్చి ఉన్నాయి. దీంతోపాటు సంస్థ మరో ప్రకటన కూడా చేసింది. ఈ లైటింగ్‌ సిస్టమ్‌ గత వేరియంట్‌తో పోలిస్తే 40 శాతం అధికంగా బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌ ఫోన్‌లు పవర్‌, వాల్యూమ్‌ బటన్‌లు కుడి వైపున ఉన్నాయి. అదే విధంగా ఎడమ వైపున మరో బటన్‌ను గమనించవచ్చు. దీంతోపాటు చిప్‌సెట్‌ వివరాలను కూడా నథింగ్‌ వెల్లడించింది. ఈ రెండు ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్‌ చిప్‌తో పనిచేస్తాయని తెలిపింది. అయితే కచ్చితమైన మోడల్‌ నంబర్లను వెల్లడించలేదు. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 4 చిప్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు 50W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu