మదురోకి సంఘీభావంగా వెనిజులాలో భారీ ర్యాలీ


వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌కు సంఘీభావంగా వేలాది మంది ప్రజలు ర్యాలీ చేపట్టారు. అమెరికా దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండిస్తూ కారకాస్‌లోని బలీవర్‌ స్క్వేర్‌లో భారీ ప్రదర్శన చేపట్టారు.ఈ కార్యక్రమంలో హాజరైన ప్రజలు సందేశాలను రాశారు. ఆ లేఖలను "బ్రింగ్‌ దెమ్‌ బ్యాక్‌" అని రాసి వున్న పారదర్శకపు బ్యాలెట్‌ బాక్స్‌లో వేశారు. వెనిజులా యువత కూడా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమయ్యారు. విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. మదురో, సిలియా ఫ్లోరెస్‌లు కొత్త తరానికి ఐక్యతకు మరియు ప్రతిఘటనకు ఉదాహరణగా నిలుస్తారని యువత పేర్కొన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org