కెనడాలో భారతీయ సంతతి యువకుడి కాల్చివేత


కెనడాలోని బ్రిటీష్ కొలంబియా లోని బర్నబీలో వాంకోవర్ లో నివాసం వుండే భారతీయ సంతతి యువకుడు దిల్‌రాజ్‌ సింగ్ గిల్ (29)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్‍వార్‍లో భాగమై ఉండొని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కెనడా వే 300 బ్లాక్‌లో జరిగిన కాల్పుల గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కానీ, తీవ్రంగా గాయపడిన దిల్‌రాజ్ అప్పటికే చనిపోయాడని, అతడికి నేరచరిత్ర ఉందని అధికారులు పేర్కొన్నారు. కెనడాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతి వ్యక్తుల హత్యలకు గురికావడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన కొద్దిసేపటికే, బక్స్‌టన్ స్ట్రీట్‌లోని 5000 బ్లాక్‌లో ఒక కారు మంటల్లో తగలబడిపోతుండటాన్ని గుర్తించారు. ఈ కారుకు, హత్యతో సంబంధం ఉందేమోనని భావించిన పోలీసులు ఆదిశగా విచారణ చేపట్టారు.  ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ హత్యపై విచారణ జరుపుతోంది. 'బాధితుడు గిల్‍కు పోలీసుల రికార్డులు ఉన్నాయి. ఈ కాల్పులకు గ్యాంగ్‌ వార్‌తో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది' అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. తగలబడిపోయిన కారుకు ఈ హత్యతో సంబంధం ఉందని దర్యాప్తు అధికారులు నిర్దారించారు. ఆ వాహనం గురించి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 'బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ కాల్పుల ఘటన పోలీసులను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని చాలా ఆందోళనకు గురిచేసే విషయం. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగడానికి, నేరస్థులను పట్టుకోవడానికి సాక్షుల సమాచారం చాలా కీలకం' అని ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ సార్జెంట్ ఫ్రెడా ఫోంగ్ అన్నారు. అనుమానితులను గుర్తించే సాక్షుల కోసం, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న డాష్‌క్యామ్ రికార్డింగ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నాారు.హతుడు దిల్‌రాజ్‌ సింగ్‌కు డ్రగ్స్‌కు సంబంధించి నేరారోపణల చరిత్ర ఉంది. నార్త్ వాంకోవర్‌లో దిల్‌రాజ్ వద్ద 2018లో నగదు, కొకైన్, హెరాయిన్-ఫెంటానిల్ మిశ్రమాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో అతడికి 2021లో శిక్ష పడింది. అలాగే, పోలీసులను తప్పించుకున్న కేసు, 2016లో డ్రగ్స్‌తో పట్టుబడిన కేసుల్లో దోషిగా నిర్దారణ అయ్యాడు. స్థానిక మీడియా వర్గాల ప్రకారం గిల్ హత్యకు గ్యాంగ్‌ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, అబోట్స్‌ఫోర్డ్‌లో ఇటీవల జరిగిన నవప్రీత్ ధాలివాల్ హత్యతో కూడా సంబంధం ఉండవచ్చని తెలుస్తోంది. బ్రదర్స్ కీపర్స్ గ్యాంగ్‌తో ధలీవాల్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దిల్‌రాజ్‌కు కాంగ్ లేదా బిబో గ్రూప్‌తో సంబంధాలు ఉన్నట్టు కోర్టు రికార్డులు చెబుతున్నాయి.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org