ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని బి. రాయపురం గ్రామంలో భూమి వివాదం కారణంగా ఈరేగౌడు అనే వ్యక్తి తన అన్న రాధాకృష్ణను పొలంలోనే కొడవలితో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దాడి చేసిన ఈరేగౌడు పరారీలో ఉన్నాడు. రాధాకృష్ణ, ఈరేగౌడు మధ్య తరచూ గొడవలు జరుగుతుండే వని, భూమి విభజన సమస్యలు కుటుంబంలో గొడవలకు దారితీశాయని పోలీసులు పేర్కొన్నారు.
0 Comments