Ad Code

యూరోపియన్ మార్కెట్లలో ఒప్పో రెనో 15 FS 5G విడుదల


యూరోపియన్ మార్కెట్లలో అధికారికంగా ఒప్పో రెనో 15 FS 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న రెనో 15 సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Max, Reno 15 Pro Mini, Reno 15C, Reno 15F మోడళ్లకు ఇది కొత్తగా జత అయ్యింది. Reno 15 FS మోడల్ చాలా వరకు Reno 15F లాంటిదే అయినప్పటికీ, కొద్దిగా చిన్న 6,500mAh బ్యాటరీతో పాటు ఒక్కటే వేరియంట్‌లో (8GB RAM + 512GB స్టోరేజ్) అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. ఒప్పో అధికారిక పోలాండ్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధర PLN 1,599గా (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 40,600) ఉంది. ఇటలీలో ఇది EUR 469.99 (సుమారు రూ. 50,200) ధరకు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Aurora Blue మరియు Twilight Blue అనే రెండు కలర్ ఆప్షన్లలో ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్లలో లభిస్తుంది. Oppo Reno 15 FS 5Gలో 6.57 అంగుళాల ఫుల్-HD+ (2,372×1,080 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ స్యాంప్లింగ్ రేట్, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో గరిష్టంగా 1,400 నిట్స్ బ్రైట్‌నెస్, 100 శాతం DCI-P3 కలర్ గామట్, 10-బిట్ కలర్ డెప్త్‌తో 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్, ఈ స్క్రీన్‌కు Gorilla Glass మరియు AGC DT-STAR D+ గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వబడింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU ఉంది. 8GB LPDDR4X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్, microSD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించే అవకాశం, సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారంగా ColorOS 16తో వస్తుంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, 6,500mAh భారీ బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది తక్కువ సమయంలోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో eSIM,  Wi-Fi 5,  Bluetooth 5.1, NFC, GPS,USB Type-C పోర్ట్ కలిగి ఉంది. సైజ్: 158.18 × 74.93 × 8.14mm, Aurora Blue వేరియంట్, మందం: 8.27mm వరకు, కలర్‌ను బట్టి సుమారు 189గ్రా నుంచి 196గ్రా వరకు ఉంటుంది. మొత్తంగా, Oppo Reno 15 FS 5Gలో పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu