కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి !


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోశుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందినట్లుగా బంధువులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన చెందిన గోళ్ల రమేశ్ (35), అనూష(30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనం అయ్యారు.  ప్రమాద సమయంలో బస్సులో సుమారు 42 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలోకి బైక్ దూసుకెళ్లి ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org