Ad Code

టేకాఫ్ అయిన కొద్దీ కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన వెనిజులా విమానం


వెనిజులా దేశంలోని టచిరా రాష్ట్రం పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ PA-31 విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ప్రమాదానికి గురైన విమానం, ట్విన్-ఇంజన్ పైపర్ PA-31T1, స్థానిక సమయం ప్రకారం ఉదయం 9:52 గంటలకు టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో విఫలమైంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి గాల్లో పల్టీ కొట్టి రన్‌వేను ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ అత్యవసర, అగ్నిమాపక బృందాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సంఘటనను దర్యాప్తు చేయడానికి జుంటా ఇన్వెస్టిగడోరా డి యాక్సిడెంట్స్ డి ఏవియాసియన్ సివిల్ ను ప్రారంభించాయని ధృవీకరించింది. టేకాఫ్ సమయంలో టైర్ పగిలిపోయి ఉండవచ్చని ప్రాథమిక వర్గాలు సూచిస్తున్నాయి, అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu