కిసాన్ సమ్మాన్ నిధిని పదివేల రూపాయలకు పెంచుతూ ప్రధాని ప్రకటన !
కిసాన్ సమ్మాన్ నిధిని ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఏడాదికి కిసాన్ సమ్మాన్ కింద ఆరు వేల రూపాయలను రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తాన్ని కలిపి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వమే పది వేల రూపాయలకు పెంచడంతో రైతులకు ఖుషీ కబురు అని చెప్పాలి. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే ఈ నిధులను పెంచడాన్ని స్వాగతిస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లోనూ దీనికి కేటాయింపులు జరుపుతారు.