ఉక్రెయిన్‌కు చెందిన సముద్ర డ్రోన్ రష్యాకు చెందిన హెలికాప్టర్‌ను బ్లాక్‌సీలో కూల్చేసింది. మరో దానిని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన మిలటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ తమ ట్విటర్ ఖతాలో పేర్కొంది. దీనిలో మాస్కోకు చెందిన ఎంఐ-8 హెలికాప్టర్‌ను కీవ్‌కు చెందిన మగూరా వీ5 డ్రోను నేల కూలుస్తున్నట్లుంది. తొలుత రష్యాకు చెందిన హెలికాఫ్టర్ ఈ డ్రోన్‌ను గుర్తించి కాల్పులు మొదలుపెట్టింది. దీంతో చుట్టుపక్కల సముద్రంలో నీటి పైకి తూటాలు దూసుకొచ్చాయి. దీంతో తనపై కాల్పులు మొదలైనట్లు బోటు కంట్రోల్ కేంద్రానికి వెల్లడిస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపు ఓపిగ్గా ఎదురుచూడగా, ఆ హెలికాఫ్టర్ డ్రోన్ బోట్ పై అమర్చిన మిసైల్ గురిలోకి వచ్చింది. తక్షణమే ఆ క్షిపణి దూసుకెళ్లి దానిని ఢీకొనడంతో.. అది సముద్రంలో కూలిపోయింది. థర్మల్ ఇమేజర్‌లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రేడియోలో పైలట్ ''482 నన్ను ఢీకొంది.. కిందకు పడిపోతోంది'' అనే సందేశాన్ని పంపాడు. మంగళవారం క్రిమియాలోని కేప్ తర్ఖాన్‌కూట్ వద్ద మగురా వీ5 డ్రోన్‌కు చెందిన మిసైల్ ఓ హెలికాప్టర్‌ను కూల్చేసిందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జీఆర్‌యూ టెలిగ్రామ్ ఛానెల్‌లో పేర్కొంది. ఈ ఆపరేషన్ కోసం సోవియట్ కాలం నాటి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే వ్యాంపెల్ ఆర్-73 క్షిపణిలో మార్పులు చేసి సముద్ర డ్రోన్‌కు అమర్చారు. దీనికి సీ డ్రాగన్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
0 Comments