సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన సింధు, లక్ష్యసేన్!


య్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు ఏకంగా మూడు టైటిళ్లు గెలిచి సత్తా చాటారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత స్టార్ల షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ సింగిల్స్ టైటిల్స్ సాధించగా, మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జోడీ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ సింధు 21-14, 21-16తో చెన్నై చెందిన వు లు యుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అసాంతం ఆధిపత్యం చెలాయించిన సింధు వరుసగా రెండు గేమ్స్ గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. 2017, 2022 తర్వాత సింధు ఈ టోర్నీ విజేతగా నిలిచి మూడో టైటిల్ కైవసం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాత నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్న లక్ష్యసేన్.. ఈ టోర్నీలో మాత్రం విజేతగా నిలిచాడు. ఆదివారమే జరిగిన ఫైనల్లో 21-6, 21-7 తేడాతో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జేసన్ తేపై విజయం సాధించాడు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org