Ad Code

లాంచ్ అయిన 10 రోజులకే 10 వేల బుకింగ్స్ ను సొంతం చేసుకున్న స్కోడా కైలాక్ !


డిసెంబర్ 2న లాంచ్ అయిన స్కోడా కైలాక్ కంపెనీకి మంచి ఫలితాలను తీసుకొచ్చింది. లాంచ్ అయిన పది రోజుల్లోనే పది వేలకు పైగా కస్టమర్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ తిరుగులేని అడ్వాన్స్ బుకింగ్స్‌తో తన కాంపిటేటర్స్‌కు ఎదురుగా నిలిచింది. ఇంత తక్కువ సమయంలో అన్ని బుకింగ్స్ ను దక్కించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, సరసమైన ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. స్కోడా కైలాక్ లో ఫ్రంట్ ఫాసియా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద గ్రిల్, శార్ప్ హెడ్‌లాంప్స్, ఆప్ట్‌మెటిక్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు మరియు బోల్డ్ బంపర్ దీని రూపాన్ని మరింత ప్రీమియమ్‌గా మార్చాయి. గరిష్టంగా 17 ఇంచ్ అలాయ్ వీల్స్, స్లీక్ సైడ్ మోల్డింగ్స్ వంటి లక్షణాలు కైలాక్ ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కైలాక్ అధిక క్వాలిటీని కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డ్, లైటింగ్, మరియు లగ్జరీ ఫీచర్లతో కూడిన సీట్లు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, స్మార్ట్ నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ లేదా 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. 1.0-లీటర్ TSI ఇంజన్, 115 బీహెచ్పీ పవర్, 178 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్, గంటకు 188 వేగాన్ని అందుకోగలదు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 10.5 సెకన్లలో 100 కిమీల వేగం అందుకోగలదు. ఇందులో మొత్తం నాలుగు వేరియంట్‌లు ఉన్నాయి, క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, ప్రెస్టీజ్. క్లాసిక్ ఎంటీ - రూ. 7.89 లక్షలు, సిగ్నేచర్ ఎంటీ - రూ. 9.59 లక్షలు, సిగ్నేచర్ ఏటీ - రూ. 10.59 లక్షలు, సిగ్నేచర్ + ఎంటీ - రూ. 11.40 లక్షలు, సిగ్నేచర్ + ఏటీ - రూ. 12.40 లక్షలు, ప్రెస్టీజ్ ఎంటీ - రూ. 13.35 లక్షలు, ప్రెస్టీజ్ ఏటీ - రూ. 14.40 లక్షలు.

Post a Comment

0 Comments

Close Menu