ఓ కొండచిలువ సింహాన్ని చుట్టేసింది. దీంతో దాన్నుంచి తప్పించుకునేందుకు సింహం శతవిధాలా ప్రయత్నించింది. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అడవిలోని రోడ్డు పక్కన ఉన్న ఓ సింహానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అటుగా వచ్చిన ఓ పెద్ద కొండచిలువ ఊహించని విధంగా సింహాన్ని ఎటాక్ చేసింది. కొండచిలువ అనూహ్య దాడితో సింహం షాక్ అయింది. దాన్నుంచి విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. అయితే కొండచిలువ మాత్రం ఎంతో చాకచక్యంగా సింహం మెడను చుట్టేసుకుంది. మెడ వద్ద గట్టిగా పట్టేసుకోవడంతో సింహం విలవిల్లాడిపోయింది. శతవిధాలా ప్రయత్నించినా కొండచిలువ మాత్రం సింహాన్ని వదల్లేదు. ''ఈ రోజు ఎలాగైనా నిన్ను వదిలేదు లేదు''.. అన్నట్లుగా సింహాన్ని రౌండ్లు రౌండ్లు చుట్టేసి కిందపడేసేందు ప్రయత్నించింది. అయితే చివరకు ఎలాగోలా ఆ సింహం కొండచిలువ నుంచి తప్పించుకుంది. సింహాన్ని వదిలేసిన కొండచిలువ తర్వాత మెల్లగా దాని దారిని అది వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''సింహానికి చుక్కలు చూపించిన కొండచిలువ'' అంటూ కొందరు, ''కొండచిలువ పవర్ మామూలుగా లేదుగా''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
0 Comments