ఛాంపియన్స్ ట్రోపీ టూర్ షెడ్యూల్ మార్పు !



వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది. ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిర్వహించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ పీఓకేను చేర్చని సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ట్రోఫీ టూర్ కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంక్వాలో జరుగనుంది. తాజాగా ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ తన ‘గ్లోబల్ ట్రోఫీ టూర్’ని శనివారం ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో టూర్‌ ప్రారంభం కానుందని ఐసీసీ పేర్కొంది. ట్రోఫీ టూర్ పాకిస్తాన్ రాజధాని నవంబర్ 16న ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానుంది. నవంబర్ 17న తక్షిలా, ఖాన్‌పూర్, నవంబర్ 18న అబోటాబాద్, నవంబర్ 19న ముర్రే, నవంబర్ 20న నథియా గలీ, నవంబర్ 22 నుండి 25న కరాచీలో ముగుస్తుంది. అంతకుముందు.. నవంబర్ 14న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్కర్డు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ వంటి నగరాలలో ట్రోఫీ నిర్వహిస్తుందని ప్రకటించింది. కాగా భద్రతా సమస్యలపై టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదన్న సంగతి తెలిసిందే..

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org