బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు !
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ 35 (3) కింద హుజూరాబాద్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించారు. అయితే, అనుమతి లేకుండా హైవేపై ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసుల్లో పేర్కొన్నారు.