జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వర్‌తో జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. ఆదివారం రాంచీలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం హేమంత్ సోరెన్.. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ వెంటనే సీఎం రాజీనామా లేఖను ఆయన ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని గవర్నర్‌ను హేమంత్ సోరెన్ కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో తాను నవంబర్ 28వ తేదీన.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని గవర్నర్‌కు హేమంత్ సోరెన్ తెలిపారు. ఈ భేటీ అనంతరం రాజ్‌భవన్ వెలుపల హేమంత్ సోరెన్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని వెల్లడించారు. అలాగే ఇండియా కూటమి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఈ రోజును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్‌జేడీ పార్టీ నేతల సమక్షంలోనే గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహాయ్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లోని ఇండియా కూటమి అధినేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఆయనకు పార్టీ కేడర్ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతో జార్ఖండ్ అసెంబ్లీలో తమ నాయకుడిగా తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.
0 Comments