వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామా


వైసీపీ ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ నేడు రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ పంపించారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పారీల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే మరికొంత మంది నేతలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రాజీనామాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org