Ad Code

పెరిగిన బంగారం ధర - నిలకడగా వెండి ధర


టీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధర పెరుగుతుంది. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 870 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరిగింది. ఐతే, గత ఐదు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,170 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,970. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,250 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,250 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820.తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 1,01,000. చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో కిలో వెండి ధరలు రూ. 92,000 నుంచి రూ. 1,01,000 మధ్య ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu