జో బైడెన్ లానే ప్రధాని మోడీకి మెమరీ లాస్ అయిందేమో !
మహారాష్ట్ర సభలో లోక్ సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లానే ప్రధాని మోడీకి మెమరీ లాస్ అయిందని సెటైర్ వేశారు. 'మోడీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని తెలిపింది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో' అని అన్నారు.